“భోళా శంకర్” నెక్స్ట్ సాంగ్ డేట్, టైం వచ్చేశాయ్.!

ఈ ఏడాది భారీ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి ఐతే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్ళీ తన రేంజ్ హిట్ ని అయితే “వాల్తేరు వీరయ్య” తో అందుకున్నారు. దీనితో ఈ సినిమా తర్వాత చేస్తున్న రీమేక్ చిత్రానికి కూడా హైప్ వచ్చేసింది. ఆ సినిమానే “భోళా శంకర్”.

తమిళ్ లో ఎప్పుడో వచ్చిన సినిమాకి ఇది రీమేక్ కాగా ఈ సినిమా ఈ చిత్రాన్ని తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకుని మెగాస్టార్ వెకేషన్ కి కూడా వెళ్లగా ఇప్పుడు లేటెస్ట్ గా అయితే మేకర్స్ సినిమా నుంచి రెండో సాంగ్ పై అదిరే అప్డేట్ ని మెగాస్టార్ పోస్టర్ తో అయితే అందించారు.

కాగా ఈ రెండో సాంగ్ ని అయ్యితే సరిగ్గా సినిమా రిలీజ్ కి నెల రోజులు ఉంది అనగా ఈ జూలై 11న అయితే లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ సాంగ్ అయితే జూలై 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా టైం కూడా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

మరి మొదటి సాంగ్ కి ఏమంత గొప్ప ఫీడ్ బ్యాక్ అయితే రాలేదు ఇక ఈ రెండో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్, యంగ్ హీరో సుశాంత్ తదితరులు నటిస్తున్నారు. అలాగే వచ్చే ఆగస్ట్ 11న అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.