క్రిష్ మరో ఏడాది ఆగాల్సిందేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం క్రిష్ హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ కాకతీయుల కాలంనాటి కథాంశంతో రెడీ అవుతోంది. ఈ మూవీలో బందిపోతు దొంగ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ కెరియర్ లో చేస్తోన్న మొట్టమొదటి హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇదే కావడం విశేషం.

అయితే గత రెండేళ్ళ నుంచి ఈ మూవీ కొనసాగుతూనే ఉంది. కరోనా ప్రభావంతో ఎప్పటికప్పుడు ఆరంభంలో మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా అనుకున్న స్థాయిలో డేట్స్ కేటాయించలేకపోవడం కూడా హరిహర వీరమల్లు ఆలస్యానికి ఒక కారణం అని చెప్పాలి.

అయితే అన్ని ముగించుకొని ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నారు. దసరా నాటికి అందించాలని అనుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్యాక్ టూ బ్యాక్ కాల్ షీట్స్ ఇచ్చేశాడు. ఈ రెండు కంప్లీట్ చేసుకొని హరిహర వీరమల్లు స్టార్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇప్పటికే పూర్తి చేసిన వినోదాయ సీతమ్ జులై 28న రిలీజ్ కాబోతోంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఓజీ మూవీ కూడాసెప్టెంబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేసే టార్గెట్ తోనే సుజిత్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

మరి హరిహర వీరమల్లు 35 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అది కంప్లీట్ చేసాక విజువల్ ఎఫెక్ట్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. వీటిని పూర్తి చేసుకొని దసరాకి అంటే రిలీజ్ చేయడం కష్టం అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు క్రిష్ హరిహర వీరమల్లుతో వెయిట్ చేయాల్సిందే అనే మాట వినిపిస్తోంది.