‘దసరా’ దర్శకుడి పంట పండినట్టే.!

సినిమా విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓడెల. ‘సినిమా ఇండస్ట్రీకి నేనేమిచ్చాను.? అని వెనక్కి తిరిగి చూసుకుంటే, శ్రీకాంత్ ఓడెల లాంటి గొప్ప దర్శకుడు కనిపిస్తాడు’ అని ‘దసరా’ గురించి హీరో నాని చాలా గర్వంగా చెప్పేసుకున్నాడు. నాని అన్నాడని కాదుగానీ, ‘దసరా’ టీజర్ ఎండింగ్‌లో హీరో నోట్లో కత్తి.. ఆ కత్తి మీద వేలుతో గాయం చేసుకున్న హీరో, ఆ గాయం వల్ల వచ్చిన రక్తాన్ని హీరో తన నుదుటన తిలకంలా దిద్దుకోవడం.. ఈ షాట్ గురించి సినీ పరిశ్రమలో బోల్డంత చర్చ జరుగుతోంది.

రెండు బిగ్ బ్యానర్స్, ‘దసరా’ టీజర్ తర్వాత బ్లాంక్ చెక్కులు ఇచ్చాయట శ్రీకాంత్ ఓదెలకి. ఓ యంగ్ హీరో అయితే, తానే స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానంటూ శ్రీకాంత్ ఓడెలతో చెప్పాడట.

మొన్నామధ్యన ‘ఉప్పెన’ సినిమా విషయంలో దర్శకుడు బుచ్చిబాబుకి ఇలాగే ప్రశంసలు దక్కాయి.. అదీ సినిమా రిలీజుకి ముందు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ ఓడెల పేరు అలా మార్మోగిపోతోంది.