ధమ్కీ బాక్సాఫీస్.. టార్గెట్ ఎంతంటే?

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దమ్కీ. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతుంది. విశ్వక్ సేన్ తండ్రి ఈ మూవీని నిర్మించడం విశేషం. ఇక సొంత ప్రొడక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాని విశ్వక్ చాలా పాషన్ గా తీసుకొని చేశారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మూవీలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి విషెస్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయ్యింది. తెలుగు స్టేట్ ని అన్ని ఏరియాలో మంచి ఫ్యాన్సీ రేటుకి థీయాట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ సినిమా నైజాం ఏరియాలో 3 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. సీడెడ్ లో కోటి, ఆంధ్రాలో 2.8 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో 70 లక్షలకి రైట్స్ అమ్ముడయ్యాయి.

మొత్తం 7.50 కోట్ల బిజినెస్ తెలుగు వెర్షన్ కి బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఇతర భాషలలో కూడా రిలీజ్ చేస్తున్న నేపధ్యంలో వాటి బిజినెస్ ఎంత జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అయితే తెలుగులో 8 కోట్ల కలెక్షన్స్ ని దమ్కీ మూవీ కలెక్ట్ చేస్తే హిట్ క్యాటగిరీలో చేరిపోతుంది.

ఇక సినిమాకి ఉన్న బజ్ చూస్తే మినిమం బాగుంది అనే టాక్ తెచ్చుకున్న కూడా మొదటి వారంలోనే ఈ మూవీ బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే మాట వినిపిస్తుంది. ఇక విశ్వక్ కి దమ్కీ మూవీ ఏ మేరకు కమర్షియల్ హీరో అనే ఇమేజ్ ని తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి. ఈ సినిమా సక్సెస్ అయితే ప్రస్తుతం అతనికి ఉన్న కమిట్మెంట్ ల నేపధ్యంలో ఎన్టీఆర్ చెప్పినట్లు మరల దర్శకత్వం వైపు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది.