RRR:రాజమౌళి కి జీవితాంతం రుణపడి ఉంటా.. దానయ్య ఎమోషనల్ స్పీచ్.!

 

RRR: అనుకున్నట్టుగానే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిక్బలాపూర్ లో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుక జన సందోహం నడుము కన్నుల పండుగగా జరిగింది.వేదికకి కనుచూపు మేరలో జన ప్రవాహం  కనిపిస్తోంది. అయితే ఈ వేడుకకుు కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా ఇంకా కర్ణాటక హెల్త్ మినిష్టర్ గౌరవ అతిథిగా అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ఈ కుమార్ ప్రత్యేక అతిథిగా ఈ వేడుకకి విచ్చేశారు.

ఈ వేడుకలో సినిమా నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ..ఈ వేడుకకి విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి గారికీ ఇంకా హెల్త్ మినిష్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు పవర్ఫుల్ హీరోలతో ఈ సినిమాను రాజమౌళి గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి నిర్మాతగా ఉండే అవకాశం ఆయన నాకు ఇచ్చారు. ఇక అందుకు నేను ఈ జన్మంతా ఆయనకి రుణపడి ఉంటాను ఆయన అన్నారు. అంతేకాకుండా నిజానికి నేను చాలా విషయాలు మాట్లాడాలని ఈ స్టేజ్ పైకి వచ్చాను. కానీ ఇంతమందిని ఇక్కడ ఇలా చూస్తుంటే నాకు అసలు మాటలు రావడం లేదు. ఈ సినిమా టిక్కెట్ల రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని అలాగే ఇండస్ట్రీ తరఫున కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”. అని చెప్పి వెళ్ళి పోతూ మళ్ళీ తిరిగి వచ్చి క్షమించండి అంటూ ఎన్టీఆర్ చరణ్ గారికి నా కృతజ్ఞతలు.. మీరు ఏమీ అనుకోవద్దు అని చెప్పారు.

మరొకసారి స్టేజ్ మీదకు వచ్చి శివ రాజ్ కుమార్ గారికి మర్చిపోయిన ఎందుకు సారీ చెప్తూ.. వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఆయన ఇలా రెండుసార్లు స్టేజి మీదికి వచ్చి మాట్లాడి మరి వెళ్ళడం మరి రావడం చూసి వేదిక మీద ఒకసారి నవ్వులు పూసాయి. దీన్ని చూసిన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,రాజమౌళి నవ్వుకోవడం కనిపించింది.