Daggubati: పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన దగ్గుబాటి కోడలు… తండ్రైన దగ్గుబాటి హీరో?

Daggubati: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. రామానాయుడు నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఆయన కుమారులు సురేష్ బాబు ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ ఉండగా వెంకటేష్ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక రానా కూడా హీరోగా అడుగు పెట్టారు. సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ గురించి కూడా అందరికీ తెలిసిందే.

అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా కారణంగా భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు ఇక ఈ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే గత ఏడాది తమ బంధువుల అమ్మాయి అయినటువంటి ప్రత్యూషతో కలిసి ఈయన ఏడడుగులు వేశారు.

వీరి వివాహం శ్రీలంకలో ఎంతో ఘనంగా జరిగింది అనంతరం హైదరాబాదులో వీరి రిసెప్షన్ నిర్వహించారు. ఇలా గత ఏడాది వివాహం చేసుకున్న అభిరామ్ ప్రత్యూష తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారని తెలుస్తుంది ఇవాళ ప్రత్యూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి రానా కంటే కూడా దాదాపు మూడు సంవత్సరాలు ఆలస్యంగా పెళ్లి చేసుకున్న అభి రామ్ రానా కంటే ముందుగానే తండ్రిగా ప్రమోట్ అయ్యారు.

ఇలా ఈయనకు కూతురు పుట్టడంతో రానా పెదనాన్నగా సురేష్ బాబు వెంకటేష్ తాతయ్యలుగా ప్రమోట్ అయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబంలోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.