డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. తమన్ మళ్లీ ఇచ్చి పడేసాడుగా!

నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో మన అందరి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ 109వ చిత్రం గా ఈ సినిమాని బాబి దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణని మునిపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడు దర్శకుడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ ఫ్యాన్స్ లో సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ క్రమంలో మేకర్స్ అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోని విడుదల చేశారు. డేగ.. డేగా,గుర్రంపై స్వారీ చేసే సింహం ఇదేగా అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ ఎనర్జిటిక్ సాంగ్ కి తమన్ స్వరాలు అందించగా అనంత శ్రీరామ్ చక్కటి సాహిత్యాన్ని అందించారు.

సింగర్ నాకాష్ అజీజ్ ఈ పాటని పాడారు. 0.51 సెకండ్స్ పాటు ఉన్న ప్రోమో కు తమన్ అందించిన మ్యూజిక్ బీభత్సం అనే చెప్పాలి. బాలకృష్ణ సాంగ్ అనే సరికి తమన్ కి పూనకం వస్తుందో ఏంటో కానీ బాలయ్య సినిమాకి ఓ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు. అఖండ సినిమాకి మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో తమన్ తాండవం ఉంటుంది అంటున్నారు మ్యూజిక్ లవర్స్.

ఈరోజు జస్ట్ ప్రోమోతో సరిపెట్టిన మేకర్స్ శనివారం ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం.

Daaku's Rage Lyric Video Promo | Daaku Maharaaj | Nandamuri Balakrishna | Bobby Kolli | Thaman S