బాలకృష్ణ పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞ!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అధికారపక్షం మధ్య ఎప్పుడు ఏదో ఒక విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇటీవల విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఇక అధికార ప్రభుత్వం ఇలా దివంగత ఎన్టీఆర్ పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంతో ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా జగన్ ప్రభుత్వం గురించి విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కూడా ఎదురు దాడి చేస్తూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఏపీ మంత్రి మెరుగు నాగార్జున కూడా స్పందిస్తూ.. ‘ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరు యూనివర్సిటీ కి పెడితే మీరు చేసిన పాపాలు తొలగిపోతాయా?’ అంటూ ఘాటుగా విమర్శలు చేశాడు.

ఇక బాలకృష్ణ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఘాటుగా స్పందించాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..’ రెండు రోజులుగా బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలు ఏం చేసినా కూడా ఆయన వెంట్రుక కూడా పీకలేరు. అవసరం ఉన్నప్పుడు కాళ్లు పట్టుకొని అవసరం తీరాక కారుకూతలు కూస్తే కాలమే సమాధానం చెబుతుంది ‘ అంటూ సాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోనే ఉంది దీనికి అంతం ఎప్పుడూ ఉంటుందో చూడాలి మరి.