రామ్ చరణ్ “గేమ్ చేంజర్” పై క్రేజీ రూమర్స్.. 

రానున్న రోజుల్లో టాలీవుడ్ హీరోస్ నుంచి మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ కాంబినేషన్ లలో అయితే గ్లోబల్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతుంది.

కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది గత కొన్నాళ్ల కితమే నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు కానీ ఇప్పుడు కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ సినిమా సెప్టెంబర్ లో కానీ రాకుంటే అక్టోబర్ లో గాంధీ జయంతి కానుకగా వస్తుంది అని కొన్ని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మరో న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో శంకర్ దగ్గరుండి డిజైన్ చేసుకున్న ఓ స్టైలిష్ అండ్ క్రేజీ ఏక్షన్ సీక్వెన్స్ కోసం తెలుస్తుంది. ప్రస్తుతం ఏక్షన్ సీక్వెన్స్ లలో మంచి ట్రెండ్ గా మారిన మోకోబాట్ కెమెరాతో చేసిన ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని అంటున్నారు. ఈ తరహా టెక్నాలజీతో విక్రమ్, బీస్ట్ చిత్రాలు అలాగే రీసెంట్ గా లియో సినిమాలో సీన్స్ వచ్చాయి.

ఇక ఇలాంటి టెక్నాలజీతో శంకర్ లాంటి దర్శకుడు ఏమేం చెయ్యగలడో ఊహించలేం.. అందుకే ఈ పర్టిక్యులర్ ఏక్షన్ సీన్ పై కూడా మంచి ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.