ఇన్సైడ్ టాక్ : క్రేజీ లైన్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తో అయితే “భోళా శంకర్” అనే రీమేక్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా రీమేక్ కావడంతో మరీ అంత హైప్ అయితే ఏమీ లేదు. అప్పట్లో చిరు రీమేక్ సినిమాలు బాగా రన్ అయ్యేవి కానీ ఇపుడు అంతలా అయితే ఏమి లేదు.

అలాగే ఒకప్పుడు మంచి ప్రయోగాత్మక సినిమాలు కూడా మెగాస్టార్ చేశారు. ఇప్పుడు తన నుంచి ఆ తరహా సినిమాలు కూడా మిస్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ ఓ ఇంట్రెస్టింగ్ ఎక్స్ పెరిమెంటల్ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ “బింబిసార” దర్శకుడు వశిష్ట తో చిరు సినిమా ఓకే చేయగా దీనికి ఆసక్తికర లైన్ ని తాను నరేట్ చేసాడట. ఈ సినిమా ఓ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ లా ఉంటుంది. అని అంతే కాకుండా సినిమాలో ఫాంటసీ టచ్ కూడా ఉంటుంది అని తెలుస్తుంది.

మరి ఇవన్నీ వింటుంటే చిరు కెరీర్ లో చేసిన పలు అడ్వెంచర్, థ్రిల్లర్ చిత్రాలు వేట, అంజి లాంటి తరహా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లు గుర్తు రాక మానవు. మరి చిరు డెఫినెట్ గా ఈ సబ్జెక్టు తో వస్తే మాత్రం మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఈ టాక్ ఎంతవరకు నిజం అనేది రానున్న రోజులు డిసైడ్ చేయాలి.