Crazy Sequels: ఈ హీరో లైనప్ లో క్రేజీ సీక్వెల్స్!

తమిళ యాక్టర్ కార్తి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్ మూవీలకు బ్రాండ్ అంబాసడర్‌గా మారిపోయాడు. ఎప్పుడూ విభిన్నమైన కథలతో దూసుకెళ్లే ఆయన, ఇప్పుడు తన ఫిల్మోగ్రఫీలో వరుసగా ఫ్రాంఛైజీలను జోడించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కథకు ప్రాముఖ్యత ఇచ్చే కార్తి.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ సినిమాలతో మరోసారి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే దిశగా ప్రయాణిస్తున్నాడు.

ఇప్పటికే ‘సర్దార్ 2’ షూటింగ్ చివరి దశకు చేరగా, ఆగస్ట్‌ 15న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్‌ స్పై థ్రిల్లర్‌గా సూపర్ హిట్ అవ్వడంతో, రెండో పార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ‘హిట్ 3’ చివర్లో కార్తి ఎంట్రీ ఇచ్చిన సన్నివేశం సంచలనం రేపింది. అప్పుడు ఊహించినదే నిజమవుతోంది. ‘హిట్ 4’లో కార్తి వీరప్పన్ పాత్రలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు.

ఈ రెండు కాకుండా ‘ఖైదీ 2’ కూడా అధికారికంగా అనౌన్స్ అయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా, ‘కూలీ’ తర్వాత కార్తి లైనప్‌లో నెక్స్ట్. ‘ఖైదీ’తో భారీ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ స్థాయి క్రేజ్ నెలకొంది. మరోవైపు, 2017లో వచ్చిన ‘ఖాకీ’కి సీక్వెల్ రాబోతుందని సమాచారం. హెచ్. వినోద్ ప్రస్తుతం విజయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ తర్వాత ‘ఖాకీ 2’ పై ఫోకస్ పెట్టనున్నాడట.

కంగువ చివర్లో పరిచయం చేసిన కార్తి క్యారెక్టర్‌తో ‘కంగువ 2’కి అవకాశం తెచ్చినా, మొదటి భాగం ఫలితం నిరాశపరిచిందట. అందుకే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడినట్టు టాక్. అయినా, ఇప్పుడే కార్తి చేతిలో మూడు క్రేజీ సీక్వెల్స్ ఉండటం విశేషం. అందులో రెండు ఇప్పటికే హిట్ అవ్వగా, మూడోది ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉండబోతోంది.

పవన్ కంటే విజయ్ బెటర్ || Senior Journalist Bharadwaj About Vijay Thalapathy Vs Pawan Kalyan || TR