బుల్లితెర ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాలలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు మనదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలో అద్భుతంగా నడుస్తుంది. ప్రస్తుతం తెలుగులో నాలుగో సీజన్ జరుపుకుంటుండగా, నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళంలో ప్రారంభమైన ఈ షో అక్కడ కూడా నాలుగో సీజన్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ షో వేదికపై నుండే కమల్ .. నాగార్జునతో పాటు తెలుగు కంటెస్టెంట్స్‌తో మాట్లాడారు. అంతేకాదు హారికని కూడా సేవ్ చేశారు.
సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న తమిళ బిగ్ బాస్ సీజన్‌కు నివర్ ఎఫెక్ట్ తగిలిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. నివర్ తుఫాను వలన చెన్నై మొత్తం జల సంద్రంగా మారింది. భారీ వర్షాలకు చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా భారీగా చేరిందని, అన్ని రూంస్ నీటితో నిండిపోయాయని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో హౌజ్‌మేట్స్‌ని సురక్షితంగా దగ్గరలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించినట్టు కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది . అయితే హోటల్‌కు తరలించే సమయంలో ఎక్కడికి తీసుకెళుతున్నాం అనే విషయం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి తీసుకెల్లారట.
బిగ్ బాస్ హౌజ్‌లోకి వరదలు రావడం, ఆ తర్వాత నీటిని బయటకు తోడేయడం, దీనికి నాలుగు గంటల పాటు సమయం పట్టిందని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించారు. బిగ్ బాస్ పై నివర్ ఎఫెక్ట్ ఏమి లేదని, టాస్క్‌లో భాగంగానే మేము హౌజ్‌మేట్స్‌ను హోటల్‌కు తరలించామని అన్నారు.కాగా, తెలుగు బిగ్ బాస్ షోని జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ చేయగా, తమిళంలో మాత్రం కమల్ హాసన్ ఒక్కడే నాలుగు సీజన్స్‌ని నడిపిస్తూ వస్తున్నారు