ఇండస్ట్రీ బజ్ : “ఓజి” పై క్రేజీ న్యూస్???

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “బ్రో ది అవతార్” ఇప్పుడు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబడుతుండగా ఈ సినిమా కాకుండా అయితే పవన్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో భారీ చిత్రం “ఓజి” పై నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ చిత్రంని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సినిమా షూట్ కి గాను పవన్ ఇప్పుడు కొంత బ్రేక్ ఇవ్వగా లేటెస్ట్ గా అయితే పవన్ మళ్ళీ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతాడు? ఈసారి పవన్ బర్త్ డే కానుకగా అయితే ఎలాంటి ప్లానింగ్ మేకర్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ అయితే వైరల్ గా మారింది.

కాగా ఈ చిత్రంలో అయితే పవన్ ఈ ఆగస్ట్ లో ఏదొక సమయంలో పాల్గొననుండగా ఈసారి పవన్ బర్త్ డే కానుకగా అయితే ఓజి నుంచి ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. టీజర్ కూడా అన్నట్టు వినిపిస్తుంది కానీ ఒకవేళ టీజర్ ప్లాన్ లేకపోతే షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఓజి నుంచి ఆ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ ఇస్తారని తెలుస్తుంది.

కాగా ఈ చిత్రంలో అయితే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లాంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నిర్మాణ సంస్థ డీవీవీ వారు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.