క్రేజీ మూమెంట్ : ప్రముఖ హాలీవుడ్ అవార్డ్ నెగ్గిన “RRR” సాంగ్.!

ఈరోజు జనవరి 11 తెల్లవారుతూనే మన తెలుగు ప్రజలు గర్వపడే వార్త అయితే సినిమా నుంచి వచ్చింది అని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు ఎప్పుడో మన తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించి ఆ యశస్సు ని వేరే లెవెల్లో సెట్ చేసి పెట్టారు. మరి తాను చేసిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి క్రేజీ న్యూస్ ని అయితే షేర్ చేశారు.

ఈ చిత్రం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సినిమా దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకోగా ఇప్పటికీ ఈ హవా ని అనేక దేశాల్లో అయితే కొనసాగిస్తోంది. ఒక ఈ సినిమా అయితే ఈ ఉదయమే ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ లో ఒకటైనటువంటి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023 కి గాను బెస్ట్ సాంగ్స్ లో విన్నర్ గా RRR సాంగ్ నిలిచింది.

మరి ఈ చిత్రంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ “నాటు నాటు” సాంగ్ సంచలనం నమోదు చేసింది. దీనితో ఈ గ్రాండ్ ఈవెంట్ లో ఈ అవార్డు ని అనౌన్స్ చేయగా ఎం ఎం కీరవాణి వెళ్లి ఆ అవార్డును అందుకున్నారు. దీనితో ఈ సంతోషకర మూమెంట్ తో చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉండగా పట్టరాని ఆనందంతో ఆ ఈవెంట్ లో సంతోషం వ్యక్తం చేసారు.

దీనితో ఈ ఉదయమే ఇలాంటి న్యూస్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ సహా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఆ వీడియో క్లిప్స్ ని షేర్ చేసి సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తుండగా టోటల్ ఇండియా అంతా ఇప్పుడు మరోసారి RRR పేరు జపిస్తుంది.