NTR 30 : గాసిప్స్ : జూ. ఎన్టీఆర్ భారీ సినిమాలో విలన్ గా ఊహించని నటుడు పేరు..?

NTR 30 : ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పలు క్రేజీ ప్రాజెక్ట్ లనే సెట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా మూడు సినిమాలు ఒకటి తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ, తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన అలాగే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో మైండ్ బ్లోయింగ్ లైనప్ ని యంగ్ టైగర్ సెట్ చేసాడు. మరి ఈ సినిమాల్లో మొట్ట మొదట గా కొరటాల తో ప్లాన్ చేసిన హై బడ్జెట్ సినిమానే స్టార్ట్ అవ్వనున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాపై నే ఒక క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి ధీటుగా ఒక పవర్ ఫుల్ నటుడుని అప్రోచ్ అయ్యారట. మరి ఆ హీరో ఇంకెవరో కూడా కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ అట. ఈ విలక్షణ నటుడు ఇప్పుడు టాలీవుడ్ లో తన ఏజ్ కి తగ్గ సాలీడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ నటుడే ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తాడని గాసిప్స్..

అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది కానీ తాను ఇంకా ఓకే చెప్పారో లేదో అనేది తెలియరాలేదు. ఇది కానీ నిజం అయితే సినిమా డెఫినెట్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించనుండగా కళ్యాణ్ రామ్ నిర్మాణం వహిస్తున్నారు.