గాసిప్స్ : షారుఖ్ సినిమాలో బన్నీ నిడివి ఎంతంటే.?

Jawan Movie

గత కొన్ని రోజులు కితం పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ క్రేజీ గాసిప్ అయితే సినీ వర్గాలని ఓ రేంజ్ లో షేక్ చేసింది. మరి ఆ గాసిప్ అయితే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న మరో సాలిడ్ ప్రాజెక్ట్ “జవాన్” నుంచి కాగా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో అయితే నటిస్తున్నట్టుగా పలు రూమర్స్ వచ్చి సెన్సేషన్ గా మారాయి.

మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేడీ కానీ బాలీవుడ్ సినిమా నుంచి మాత్రం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ కలయిక పై అయితే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ ని అల్లు అర్జున్ రీప్లేస్ చేయగా అల్లు అర్జున్ అయితే ఈ సినిమాలో సుమారుగా 10 నుంచి 20 నిమిషాల నిడివి లో కనిపించనున్నాడట.

మరి బన్నీ రోల్ కూడా సినిమాలో చాలా కీలకంగా కనిపించనుండగా సాలిడ్ యాక్షన్ బ్లాక్ కూడా ఉండొచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈ క్రేజీ గాసిప్ సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ సినిమాని అయితే దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే వెర్సటైల్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షారుఖ్ ఖాన్ కూడా నిర్మాణం వహిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా ఈ జూన్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.