క్రేజీ ఫెలో మూవీ రివ్యూ

నటీనటులు: ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్, సప్తగిరి….

దర్శకత్వం : ఫణి కృష్ణ సిరికి

నిర్మాతలు: కె కె రాధామోహన్

సంగీతం: ఆర్ ఆర్ ధృవన్

గత కొంత కాలంగా కనీసం ఒక్క యావరేజ్ మూవీ కూడా లేకపోయినా ఆది సాయికుమార్ ప్రతి రెండు, మూడు నెలలకోసారి సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ‘బ్లాక్’, ‘తీస్ మార్ ఖాన్’ లాంటి సినిమా కనీసం వచ్చి, పోయినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇంతలో ‘క్రేజీ ఫెలో’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

నాని (ఆది సాయి కుమార్) ఎలాంటి చీకు, చింత లేకుండా  తన జీవితాన్ని జాలి గా చేస్తూ గడిపేస్తూ ఉంటాడు. ఒక  డేటింగ్ యాప్ లో జాయిన్ అయ్యి,  నాని, చిన్ని (దిగంగన సూర్యవంశీ) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అలాగే చిన్ని కూడా నాని ని ప్రేమిస్తుంది.  టైం  గడుస్తున్న కొద్ది వీరిద్దరూ మీట్ కలవాలనుకుంటారు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ చిన్ని (మిర్నా మీనన్) కి ప్రపోజ్ చేస్తాడు నాని.  అతను ఎందుకు ప్లాన్ మార్చుకున్నాడు? చిన్ని (దిగంగన సూర్యవంశీ) ఏమైంది? నాని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది సినిమాలో చూడాలిసిందే.

ప్లస్ పాయింట్స్:

తన గత సినెమాలకన్నా ఈ సినిమాలో ఆది సాయికుమార్ ఇంప్రెస్స్ చేసాడు. హెయిర్ స్టైల్, లుక్స్ తో బాటు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.  చాలా రోజుల తర్వాత దిగంగన సూర్యవంశీ కి ఒక మంచి పాత్ర దొరికింది. ఈ మూవీ లో మంచి ఎమోషనల్ సన్నివేశాల్లో దిగంగన చాలా చక్కని నటన కనబరిచి ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెయిన్ అసెట్ అంటే కామెడీ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:

కొన్ని రేపేటడ్ సీన్స్, అలాగే స్టోరీ లైన్ ఎంటి అనేది ఊహించే విధంగా ఉండటం ఈ సినిమాకి పెద్ద మైనస్. నాని పాత్రలో ఆది ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం కాస్త ఓవర్ గా అనిపిస్తుంది.

తీర్పు:

ఓవరాల్ గా  చూసుకుంటే, ఈ మూవీ పర్వాలేదు అని అనిపిస్తాయి. మూవీ స్లో గా స్టార్ట్ అవుతుంది. అయితే ఆది గత సినిమాలతో పోల్చుకుంటే మాత్రం ఈ సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది.