ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ ట్రైలర్ రిలీజ్, అక్టోబర్ 14న సినిమా విడుదల

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న  యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘క్రేజీ ఫెలో’ టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా వుంది. ఫ్యామిలీ, ఫన్, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని పెంచింది ట్రైలర్.

‘మావాడు చాలా మారిపోయాడు. ఇంతకుముందులా లేడు’అని అనీష్ కురువిల్లా, సప్తగిరికి చెప్పిన తర్వాత.. డాక్టర్ సమరానికి ఎవరో రాసిన ఉత్తరం చదువుతూ ఆది పాత్ర రివిల్ కావడం చాలా క్రేజీగా వుంది. తర్వాత ఫ్రండ్స్, ఆఫీస్ లో వచ్చిన కొన్ని సీన్స్ కంప్లీట్ ఫన్ ని పంచాయి. ట్రైలర్ లో బాలత్రిపుర సుందరి పాట ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ క్రేజీ ఫెలో కథపై ఆసక్తిని పెంచాయి. ఇక ట్రైలర్ చివర్లో ‘పుణ్యానికి పొతే పాప ఎదురైయింది” అని ఆది చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా వుంది.

ట్రైలర్ లో ఆది తన స్టయిలీష్ లుక్స్, యాక్షన్ తో అలరించాడు. ఆది కామిక్ టైమింగ్ ఎక్సటార్డినరీగా వుంది . హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ అందంగా కనిపించారు.

సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆర్ఆర్ ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ చిత్రానికి సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.

తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి,  మర్నా మీనన్

సాంకేతిక విభాగం:
సమర్పణ:  లక్ష్మీ రాధామోహన్
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత : కేకే రాధమోహన్
రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి
సంగీతం : ఆర్ఆర్ ద్రువన్
డీవోపీ: సతీష్ ముత్యాల
ఆర్ట్ : కొలికపోగు రమేష్
ఎడిటర్: సత్య గిడుతూరి
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్
ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్  కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను)
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజైనర్ : రమేష్ కొత్తపల్లి