Jr NTR: తారక్ లైనప్ లో క్రేజీ కాంబినేషన్స్.. మొదటి ఓటు దేనికి?

జూనియర్ ఎన్టీఆర్, వార్ 2 షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేశాడు. ఇక ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ మూవీ సెట్స్ పై కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదటి మొదట్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది, రిలీజ్ మాత్రం 2026 జూన్‌లోనే ఉండనుంది.

అయితే ప్రశాంత్ నీల్, వార్ 2 సినిమాలకే పరిమితం కాకుండా తారక్ ఇప్పటికే మరికొన్ని ప్రాజెక్ట్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దేవర మొదటి భాగం హిట్ కావడంతో దీని సీక్వెల్‌కి మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్ కూడా తారక్ లైన్‌లో ఉంది, దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.

ఇక్కడే ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతోంది. దేవర 2 మొదట సెట్స్ పైకి వెళ్తుందా? లేక నెల్సన్ ప్రాజెక్ట్ ముందు వస్తుందా? నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు, అది వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అందువల్ల తారక్ మొదట కొరటాల‌తోనే జతకట్టే అవకాశం ఎక్కువగా ఉంది. తారక్ 2026 మధ్య వరకు బిజీగా ఉంటాడు, కానీ తన సరికొత్త సినిమాలను ఏ పద్ధతిలో ప్లాన్ చేస్తాడో చూడాలి. ఒకేసారి రెండు సినిమాలు కొనసాగిస్తారా? లేక ఒకదానిని పూర్తి చేసి మరొకదానిలోకి వెళ్తారా? అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

BRS Leader Fire On Telangana Congress Party Ministers | CM Revanth Redyy | Telugu Rajyam