క్రేజీ బజ్ : “లియో” లో రామ్ చరణ్..?

Vijay-Leo-Fans-come-up-with-various-theories-detailsd (1)

ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు సినిమాలో కూడా మంచి క్రేజీ గా ఉన్న అవైటెడ్ చిత్రాల్లో దళపతి విజయ్ మరియు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగ్ రాజ్ ల సెన్సేషన్ కాంబో నుంచి వస్తున్న చిత్రం “లియో” కూడా ఒకటి. జస్ట్ అనౌన్సమెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ ని అందుకున్న ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అనేది మరింత కేజ్రీగా మారింది.

అయితే అనేకమంది హీరోలతో అద్భుతమైన కథనంతో ప్రెజెంట్ చేస్తూ వస్తున్న లోకేష్ మరింత మంది స్టార్స్ ని తన సినిమాల్లో లింకప్ చేస్తుండడం మూవీ లవర్స్ పిచ్చెక్కిస్తోంది. దీనితో తన సినిమాల పట్ల ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొనగా మన టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో అయితే తాను వర్క్ చేస్తున్నాడని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి.

అయితే తాను కూడా తమ కాంబోపై మాట్లాడాడు కానీ ఇప్పుడు లియో లోనే చరణ్ కనిపిస్తాడు అనే రూమర్స్ గట్టిగా మొదలయ్యాయి. లేటెస్ట్ గా లియో టైటిల్ టీజర్ లో తెలుగు స్టేట్ కి చెందిన కార్ కూడా మెయిన్ గా కనిపించడంతో ఈ తెలుగు స్టేట్ నుంచి కూడా ఓ మెయిన్ హెడ్ ప్రెజెన్స్ లింకప్ కూడా ఉందని టాక్ మొదలైంది.

అయితే ఇదే చరణ్ కోసమేనా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ మాత్రం ఓ రేంజ్ లో ఆసక్తిగా మారింది. తమిళ మీడియా వర్గాలు అయితే ఆల్రెడీ రామ్ చరణ్ ఉన్నాడంటూ ఊదరగొడుతున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ అయితే కాశ్మీర్ లో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.