‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఇద్దరు భామలట.. కానీ.!

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి మోక్షం కలిగేలా వుంది. అతి త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందిట. ఇంతకీ, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇప్పటికిప్పుడు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, పూజా హెగ్దేనే హీరోయిన్. కాకపోతే, శ్రీలీల అనూహ్యంగా తెరపైకొచ్చింది. సినిమాలో ఇద్దరూ వుండే అవకాశమైతే లేకపోలేదట.

పూజా హెగ్దేతో గతంలోనే అగ్రిమెంట్లు అయిపోయాయని అంటున్నారు. అయితే, డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం వున్నందున, సినిమాకి ఏదోలా సహకరించాలని పూజా హెగ్దే అనుకుంటోందిట.

దాంతో, శ్రీలీల మెయిన్ హీరోయిన్.. పూజా హెగ్దే కోసం ఓ స్పెషల్ రోల్, ఓ పాట.. అంటున్నారు. ఇదంతా నిజమేనా.? కట్టు కథ అయితే కాదు కదా.? బజ్ కోసం పూజా హెగ్దేనే హీరోయిన్‌ని చేస్తే, ఆ స్పెషల్ రోల్ శ్రీలీలకి వెళుతుందట.