బాలయ్య వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం… బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య!

నందమూరి నట సింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈయన తెలిసి తెలియక మాట్లాడారా లేక ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో తెలియదు కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల మధ్య నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రేపాయి.

ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ వేదికపై మాట్లాడుతూ … పక్కన ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. ఇలా అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై అక్కినేని అభిమానులు నందమూరి హీరో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని హీరో నాగచైతన్య స్పందించి బాలకృష్ణకు కౌంటర్ వేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వీళ్లను మనం అవమానపరిస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్టే అంటూ నాగచైతన్య ట్విట్టర్ వేదికగా పరోక్షంగా బాలకృష్ణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.