సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ముఖ్యం : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈయనకు ఊహించని దానికన్నా విజయం అందడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగాస్టార్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమా మంచి విజయం కావడంతో చిత్ర బృందం ఇప్పటికే సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మలయాళ లూసిఫర్ సినిమా చూడమని నాకు సలహా ఇచ్చింది. రామ్ చరణ్ రామ్ చరణ్ వల్లే నేను గాడ్ ఫాదర్ సినిమా చేశానని ఈ సందర్భంగా చిరంజీవి చొప్పుకోచ్చారు. ఇకపోతే రీమిక్స్ సినిమాలు చేయాలంటే ఎంతో కష్టపడాలని అప్పటికే ప్రేక్షకులు ఒరిజినల్ సినిమా చూసి ఉంటారు కనుక పోలికలు వెతుకుతారని, ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ఎన్నో జాగ్రత్తలు అవసరమని తెలిపారు. ఇక తన సినిమాల విషయానికొస్తే తన భార్య సురేఖ తనకు క్రిటిక్ తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారనీ చిరంజీవి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణాది సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనేది ఎంత నిజమో హిందీ సినిమాలను ఆదరించలేదు అనేది కూడా అవాస్తవం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ ప్రాంతీయత ముఖ్యం కాదు. సినిమాలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఇకపై ప్రాంతీయత అనే ట్యాగ్ వదిలేసి ఇది ఇండియన్ సినిమా అని గుర్తించండి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.