మోక్షుకి ఆ ఇంట్రెస్ట్ వుందా.? లేదా.?

సినీ నటుడిగా మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. అదిగో.. ఇదిగో.. అంటూ నందమూరి బాలకృష్ణ, తన కుమారుడి తెరంగేట్రాన్ని వెనక్కి తీసుకెళుతూ వున్నాడు.

నిజానికి, కథలన్నీ నందమూరి బాలకృష్ణ దగ్గరే వున్నాయిట. అంటే, బాలకృష్ణ కథతోనే మోక్షజ్ఞ తెరంగేట్రం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా నందమూరి బాలకృష్ణే చెప్పడం గమనార్హం.

పైగా, మోక్షు తెరంగేట్రానికి సంబంధించి తనకేమీ తొందర లేదంటున్నాడు బాలయ్య. ఇంతకీ, ఆలస్యం ఎవరి వల్ల జరుగుతోంది.? మోక్షజ్ఞకి సినీ రంగ ప్రవేశంపై ఆసక్తి లేదా.? బాలయ్యే, తన కుమారుడి తెరంగేట్రం పట్ల ఇష్టం చూపడంలేదా.? ఈ విషయమై నందమూరి అభిమానుల్లో ఒకింత గందరగోళం కనిపిస్తోంది.

ఈ ఏడాది కూడా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం వుండకపోవచ్చు. వచ్చే ఏడాది అయినా వుంటుందా.? అంటే, అదీ కష్టమేనన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

మోక్షజ్ఞకి ఆసక్తి లేదనీ, అందుకే ఈ ఆలస్యమనీ.. బాలయ్య అభిమానుల్లోనే చర్చ జరుగుతోందంటే, అలా మాట్లాడుకునేందుకు ఆస్కారం కల్పిస్తున్నది ఎవరబ్బా.?