‘స్కంధ’ మెయిన్ హీరోయిన్ ఎవరు.?

రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ మూవీ ‘స్కంధ’ లో శ్రీలీల హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంది. ఆమెనే సాయి మంజ్రేకర్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన బ్యూటీనే ఈ సాయి మంజ్రేకర్. మొదట ‘స్కంధ’ కోసం సాయి మంజ్రేకర్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి శ్రీలీల వచ్చి చేరింది. అయితే, శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్‌లో వున్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ క్రేజ్ నేపథ్యంలోనే శ్రీలీల మెయిన్ హీరోయిన్ అన్నట్లుగా ప్రొజెక్ట్ అవుతోంది.

కానీ, మెయిన్ హీరోయిన్ లీడ్ సాయి మంజ్రేకర్‌దే అంటున్నారు కొందరు. కాదు, కాదు శ్రీలీలదే అని ఇంకొందరంటున్నారు. ఎవరు మెయిన్ లీడ్ అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

ఇదిలా వుంటే, ప్రమోషన్ల విషయంలోనూ శ్రీలీలనే ఎక్కువగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎక్కువ స్ర్కీన్ ప్రెజెన్స్ మాత్రం సాయి మంజ్రేకర్‌దే అని గట్టిగా చెబుతున్నారు కొందరు. అయితే, తనకున్న స్పేస్‌లోనే అవతలి వాళ్లను డామినేట్ చేసేలా నటించేయగల స్టామినా వుంది శ్రీలీలకి.

అలాగని సాయి మంజ్రేకర్‌ని తక్కువగా చూడలేం. కానీ, ఈ అమ్మడికి ‘గని’ రూపంలో వున్నడిజాస్టర్ మైనస్ అని చెప్పొచ్చేమో. అన్నట్లు రెమ్యునరేషన్ విషయంలోనూ ఇద్దరు హీరోయిన్లకీ చాలా తేడా వుందట. మొదట శ్రీలీలకి మామూలు రెమ్యునరేషనే ఫిక్స్ చేశారట. అయితే, ఆమెకున్న స్టార్‌డమ్‌ని బట్టి ఆ తర్వాత పెంచారనీ తెలుస్తోంది.