రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.గేమ్ చేంజర్ భారతీయ చలన చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. అసలు ఈ సినిమా ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది. కానీ అనుకోని అవంతరాల వల్ల, షూటింగ్ లేటుగా జరుగుతూ ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్ కి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, విడుదలైన కొన్ని పాటలు సినిమా మీద కాంచనలు పెంచేసాయి.
అయితే ఈ సినిమా నుంచి కొత్తగా కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి ఈ సినిమా నెమ్మదిగా షూటింగ్ జరుపుకోవడం పట్ల ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు సినీ వర్గాల భోగట్టా. సినిమా జనవరి 10న విడుదల సందర్భంగా ప్రమోషన్స్ గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. ముఖ్యంగా ముంబైలో ఈ సినిమాకి సంబంధించి జరగబోతున్న భారీ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ పాల్గొంటారని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఈవెంట్స్ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయట, చెన్నైలో జరగబోతున్న ఈవెంట్ కి రజనీకాంత్ ని దర్శకుడు శంకర ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమాని రెండు భాగాలుగా తీయటం అనే హవా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందేమో అంటున్నారు సినీ విశ్లేషకులు అయితే ఈ విషయంపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మొదలుపెట్టిన చాలా సంవత్సరాల తర్వాత గేమ్ చేంజర్ పార్ట్ వన్ విడుదల అవుతుంది. ఇక పార్ట్ 2 ఉన్నట్లయితే కనుక అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో నటించబోతున్నాడు. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్లో జాయిన్ అయిపోయాడు కూడా ఆ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎన్నాళ్ళకి కంప్లీట్ అవుతుందో తెలియదు.