దాదాపు 7 నెలల తారక్ అభిమానుల నిరీక్షణకు తాజాగా తెరపడింది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కొమరం భీమ్ టీజర్ మొత్తానికి రిలీజై పోయింది. వాస్తవంగా అయితే గత మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగానే భీమ్ టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా టీజర్ కి బ్రేక్ పడింది. షూటింగ్ ఆగిపోవడం తో టీజర్ కి అవసరమైన విజువల్స్ ని షూట్ చేయలేకపోయారు. ఈ కారణంగానే భీమ్ టీజర్ ఇన్ని నెలలు ఆగిపోయింది .
ఈ విషయంలో తారక్ అభిమానులే కాదు ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురు చూసారు . కాగా ఈ నెల 5 నుంచి తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలుపెట్టిన రాజమౌళి .. జెట్ స్పీడ్ లో టీజర్ కి సంబంధించిన విజువల్స్ షూట్ చేసేశాడు. వెంటనే టీజర్ ని కంప్లీట్ చేశాడు. గురువారం కొమరం భీమ్ జయంతి సందర్భంగా బీమ్ టీజర్ ని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ కోసం ఎంతో ఉత్సాహంతో భారీ అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చిన తారక్ అభిమానులు.. టీజర్ చూశాక మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకుంటున్నారు.
ఎలాంటి అంచనాలు పోలికలు లేకుండా చూస్తే భీమ్ టీజర్ అదిరిపోయింది అని చెప్పాలి ..అయితే చరణ్ రామరాజు టీజర్ తో పోల్చుకుంటే మాత్రం ఆ రేంజ్ లో లేదన్న టాక్ వినిపిస్తుంది . భీమ్ ఫర్ రామరాజు .. రామరాజు ఫర్ భీమ్ లలో చరణ్ టీజర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రామరాజు పాత్రను ఎలివేట్ చేసిన స్థాయిలో భీమ్ పాత్ర ని ఎలివేట్ చేయలేదని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారట .
రామరాజు టీజర్ కి చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఎస్సెట్ అయిందో.. అంతకుమించి తారక్ చెప్పిన గంభీరమైన వాయిస్ ఓవర్ ప్లస్ అయింది. కానీ భీమ్ టీజర్ కి చరణ్ వాయిస్ అలా లేడని .. తారక్ లాగా టీజర్ ఎలివేట్ కాలేదన్న మాట వినిపిస్తుంది. వాస్తవంగా అయితే రెండు టీజర్స్ ని కంపేర్ చేయడం ఫాన్స్ లో కామన్ . చెప్పాలంటే రెండు బావున్నాయి. కానీ అభిమానులు అతిగా పెట్టుకున్న అంచనాలే ఇలా మాట్లాడుకుంటున్నారని అంటున్నారు.