అతనో కమెడియన్.! పేరు సత్య.! మంచి నటుడు. స్టార్ కమెడియన్‌గా మారుతున్నాడు. తాజాగా ‘రంగబలి’ సినిమా ప్రమోషన్స్ కోసం, పలువురు మీడియా పర్సనాలిటీస్‌ని ఇమిటేట్ చేశాడు. దాంతో, వాళ్ళంతా ఇరిటేట్ అవుతున్నారు.
పైకి ఏమీ అనలేరాయె.! ‘మమ్మల్ని బాగా ఇమిటేట్ చేశారు. కానీ, అలాగే ఎందుకు చేశారు.?’ అంటూ కొందరు మీడియా పర్సనాలిటీస్ గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తెరవెనుకాల కథ వేరే వుందట. వాళ్ళని ఇరిటేట్ చేయడం కోసమే ఆ ఇమిటేషన్ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా డిజైన్ చేశారట. సినీ పరిశ్రమను ఆ మధ్య కొందరు జర్నలిజం పేరుతో ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే, ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్నమాట. ‘మీరే కాదు, మీకు మేమూ కౌంటర్ ఇవ్వగలం’ అన్న కోణంలో, ఈ సెటైరికల్ ప్రమోషన్‌ని డిజైన్ చేశారు. కానీ, మధ్యలో సత్య బలైపోతున్నాడ. ఛాన్స్ దొరికితే, సత్య మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి, సదరు మీడియా పర్సనాలిటీస్ రెడీగా వున్నారట.
కక్షలు కార్పణ్యాల తరహాలో.. మీడియా సైడ్ రివెంజ్ అనుకోవాలా.?