హీరో నవీన్ చంద్రకి వార్నింగ్ ఇచ్చిన కలర్స్ స్వాతి.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్వాతి అనంతరం సినిమాలలో పలు కీలక పాత్రలలో అవకాశం అందుకొని అనంతరం హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన కలర్స్ స్వాతి వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. త్వరలోనే ఈమె ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె హీరో నవీన్ చంద్ర గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ అతనికి వార్నింగ్ ఇచ్చింది.అసలు కల స్వాతి నవీన్ చంద్రకు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.
నవీన్ చంద్ర ఐశ్వర్య లక్ష్మి నటించిన అమ్ము సినిమా ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ చంద్ర చాలా శాడిస్ట్ పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన కలర్ స్వాతి ఈ విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేను అమ్ము సినిమా చూశానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో డైలాగ్స్ కథ బ్యాక్ గ్రౌండ్ ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు.గతంలో తాను నవీన్ చంద్ర కలిసి నటించిన త్రిపుర సినిమా కన్నా ఈ సినిమాలో నవీన్ చంద్ర పాత్ర భిన్నంగా ఉందని తెలిపారు.

ఈ సినిమాలో నవీన్ చంద్ర పోషించిన శాడిస్ట్ పాత్ర చూసి షాక్ అయ్యాను. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నవీన్ చంద్ర నాతో మాట్లాడటానికి వచ్చారు.కానీ నేను చాలా సీరియస్ గా నువ్వు నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తనకు వార్నింగ్ ఇచ్చానని తెలిపారు. నవీన్ చంద్ర ఏదైనా ఒక పాత్రలో నటించాలంటే ఆ పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నటిస్తారని అందుకే తన పాత్రలు అలా ఉంటాయి అంటూ ఈ సందర్భంగా కలర్స్ స్వాతి అమ్ము సినిమాలో నవీన్ చంద్ర పాత్ర గురించి చెబుతూ తన రివ్యూ ఇచ్చారు.