“గుంటూరు కారం” వర్సెస్ “హనుమాన్”.. ఇదెక్కడి న్యాయం?

ఈ ఏడాదిలో సంక్రాంతి బరిలో అయితే తెలుగు సినిమా నుంచి వచ్చిన చిత్రాల్లో ఇండస్ట్రీ వర్గాల్లో అయితే మోస్ట్ హాట్ టాపిక్ గా నిలిచిన క్లాష్ ఏదన్నా ఉంది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం అలాగే యంగ్ హీరో తేజ సజ్జ నటించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం హనుమాన్ ల మధ్య క్లాష్ కోసమే అని చెప్పాలి.

ఈ సినిమాలని సమానంగా ఆదరించాలి అనే పాయింట్ పక్కకి వెళ్లి ఒక సినిమాని ఇంకో సినిమా తొక్కేయాలి అనే కాన్సెప్ట్ లోకి ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది. కాగా రిలీస్ అయ్యాక ఎలాగో హనుమాన్ దే పై చేయి అని అందరికీ క్లియర్ అయిపొయింది. యూఎస్ వసూళ్లు చూసుకున్నా కూడా హనుమాన్ కె ఎక్కువ వస్తున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్స్ తక్కువ ఉన్నా కూడా హనుమాన్ డిమాండ్ భారీ లెవెల్లో ఉంది. కానీ ఇక్కడ మరో షాక్ హనుమాన్ టీం కి తగిలింది. హైదరాబాద్ లో హనుమాన్ షోస్ ఆల్రెడీ హౌస్ ఫుల్స్ అయ్యిన థియేటర్స్ లో ఆ షోస్ తీసేసి మరీ బుకింగ్స్ అవ్వనటువంటి గుంటూరు కారం సినిమాని యాడ్ చేయడం హనుమాన్ చూద్దాం అనుకునేవారికి షాకింగ్ గా మారింది.

ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో అయితే వారు ప్రశ్నిస్తున్నారు. దీనితో హనుమాన్ సినిమాకి ఈ రకంగా కూడా గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్ లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల్లో ఇప్పుడు మళ్ళీ గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ రచ్చ స్టార్ట్ అయ్యింది. మరి ఇదంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో ఏంటో చూడాలి.