ఇటీవల తంగలాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం వీర ధీర సూరన్ 2. చియాన్ 62 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుషార విజయన్, ఎస్ జె సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకి జీ వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
చిన్నా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎస్ యు అరుణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ టీజర్ లాంచ్ చేశారని తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కూడా అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు 14 మిలియన్ల వ్యూస్ ని రాబట్టుకుంది. ఇప్పుడు తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు. విక్రం ని చాలా రోజుల తర్వాత కొత్త అవతారంలో చూపించబోతున్నట్లు టీజర్ తోనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఈసారి విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాకెడ్ కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడని అర్థమవుతుంది. విక్రమ్ గ్యాంగ్ కి పోలీసుల కు మధ్య జరిగే పోరు నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. కిరాణ కొట్టులో హీరో ఉండటం, సరుకుల కోసం మహిళ రావడం, పడుకున్న తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది మెల్లిగా అడుగు అంటూ హీరో అనటం, జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తరువాత వెంటనే విధ్వంసం సృష్టించడం ఇలా విక్రమ్ పాత్రలోని రెండు కోణాలని టీజర్ లో చూపించాడు డైరెక్టర్.
ఈ టీజర్ లో విక్రమ్ నటన యాక్షన్ సీక్వెన్స్ లు విజువల్స్ నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి.ఈ సినిమా రెండు పార్ట్లు గా రాబోతుంది. వీర ధీర సూరన్ పార్ట్ టు సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ జనవరిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది.