ఇండస్ట్రీ టాక్ : చిరు మరో రీమేక్ రిలీజ్ కూడా రెడీ అట

ఇపుడు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నా సరే తాము మంచి సినిమాలే చేస్తున్నాము అని అదే రొట్ట రీమేక్ చిత్రాలతో ఫ్యాన్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోస్ హింసిస్తున్నారని చెప్పడం సందేహమే లేదు. వాటితో సేఫ్ గేమ్ ఆడి హిట్ కొట్టడం అటుంచితే అవి లాభాలు ఇచ్చిన పాపాన పోలేదు.

ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో భారీ నష్టాలని తప్ప లాభాలు ఇవ్వడం లేదు అందుకు ఉదాహరణే లేటెస్ట్ చిత్రం బ్రో మరియు భోళా శంకర్ లు. అయితే ఈ చిత్రాలు డిజాస్టర్ లుగా నిలిచిపోగా ఇంకా మెగా బ్రదర్స్ రీమేక్ చిత్రాలు ఆపడం లేదు. అయితే వాటిలో నెక్స్ట్ మెగాస్టార్ చేస్తున్న “బ్రో డాడీ” కూడా ఒకటి కాగా..

ఈ చిత్రం షూటింగ్ సహా రిలీజ్ లపై కూడా సినీ వర్గాల నుంచి బజ్ వచ్చింది. కాగా దీనితో అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసేసి వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి తీసుకొచ్చేస్తారట. దీనితో మళ్ళీ కొన్ని నెలల్లోనే మరో రీమేక్ ఫ్యాన్స్ కి అందిస్తారని చెప్పాలి.

కాగా ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోయిన్ త్రిష లు నటించనుండగా మరి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటించే ఛాన్స్ ఉందని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మెగా వర్గాలు మాత్రం ఇది ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని అంటున్నారు. మొత్తానికి రీమేక్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.