Home News చిరు ప్ర‌శంస‌ల‌కు పొంగిపోయిన యాంక‌ర్ ప్ర‌దీప్.. అవి మ‌ర‌పురాని క్ష‌ణాలంటూ కామెంట్

చిరు ప్ర‌శంస‌ల‌కు పొంగిపోయిన యాంక‌ర్ ప్ర‌దీప్.. అవి మ‌ర‌పురాని క్ష‌ణాలంటూ కామెంట్

త‌న మాట‌ల తూటాల‌తో ల‌క్ష‌లాది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్. అనేక టీవీ షోస్‌తో బుల్లితెర ప్రేక్ష‌కులకి ఎంతో వినోదాన్ని అందిస్తున్న‌ ప్ర‌దీప్ ఇటీవ‌ల హీరోగాను అల‌రించేందుకు సిద్ద‌మయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. లెక్క‌ల మాస్టారు సుకుమార్ శిష్యుడు మున్నా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమా నుండి విడుద‌లైన నీలినీలి ఆకాశం అనే సాంగ్‌కు ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది. సంగీత ప్రియుల‌ని ఈ పాట ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది.

Ramuuu | Telugu Rajyam

30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాలో ప్ర‌దీప్ స‌ర‌స‌న అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించారు. ఎస్వీ బాబు చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మించారు. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే యాంక‌ర్‌గా ప్ర‌దీప్‌కు ప్ర‌త్యేక శైలి ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్ష‌న్స్‌ను కూడా సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేసిన ఘ‌న‌త మనోడిది. తాజాగా సుమ నిర్వ‌హిస్తున్న టాక్ షోకు హాజ‌రైన ప్ర‌దీప్ త‌న జీవితంలో కొన్ని మ‌ధురానుభూత‌ల‌ను పంచుకున్నాడు.

చిరంజీవి గారు త‌న ప‌ట్ల చూపిన ప్రేమ‌కు ముగ్దుడ‌య్యాడంటూ చెప్పుకొచ్చారు ప్ర‌దీప్. యాంక‌ర్‌గా మంచి గుర్తింపు వ‌చ్చాక ప్ర‌దీప్ ఓ సారి మెగాస్టార్ చిరంజీవిని క‌ల‌వ‌డానికి వెళ్ళార‌ట‌. అప్పుడు ఆయ‌న ప్రేమ‌తో ప్ర‌దీప్ అని పిలిచి ..మీ వాయిస్ నాకు చాలా ఇష్టం. తెలుగు ప‌దాల ఉచ్చార‌ణ చాలా బాగుంటుంది అని ప్ర‌శంసించార‌ని ప్ర‌దీప్ చెప్పుకొచ్చాడు. చిరు మాట‌ల‌ని అలా వింటూ నిలుచుండిపోయిన ప్ర‌దీప్‌ని కూర్చోండి అని మెగాస్టార్ అన‌డం జీవితంలో మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న అంటూ ప్ర‌దీప్ ఓపెన్ అయ్యాడు

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News