చరణ్ ని చూసి చిరు, పవన్ లు నేర్చుకోవాల్సి ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరిని కలిపితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. మరి ఈ ముగ్గురు భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు టాలీవుడ్ లో. అయితే అన్నయ్య సినిమాలు డీలా పడినప్పుడు పవన్ సినిమాలు రాణించాయి. అలాగే ఇద్దరి సినిమాలు ఫెయిల్ అయినప్పుడు చరణ్ ఒక సేవియర్ లా నిలిచాడు.

కానీ ఇప్పుడు అయితే ముగ్గురు లైనప్ లు వారు ఎంచుకునే సినిమాలు చూసినట్టు అయితే పవన్ చిరు కన్నా చరణ్ ఎంతో బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు రోజుల్లో కూడా ఓటిటి లో చూసేసిన సినిమాలు మళ్ళీ రీమేక్స్ చేస్తున్నారు.

దీనితో సదరు అభిమానులే నిరాశ వ్యక్తం చేస్తుండగా చరణ్ నేను మాత్రం రీమేక్ చేయాల్సి వస్తే డెఫినెట్ గా అది ఓటిటి లో రిలీజ్ కాకుండా ఉండాలి కేవలం ఒక్క భాషలోనే ఉండాలి అని పలు కండిషన్స్ చెప్పుకొచ్చాడు. మరి దీనితో అయితే రీమేక్ సినిమా ఎలా తీసుకోవాలో అనేది ఇప్పుడు చరణ్ కి ఉన్నంత క్లారిటీ చిరు పవన్ లకి లేకుండా పోయింది అని ఇప్పుడు వారి అభిమానుల ఆవేదన.

ఈ ఒక్క విషయంలో మాత్రం చిరు పవన్ లు చరణ్ ను చూసి నేర్చుకువాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. రొటీన్ రీమేక్ సినిమాలతో మమ్మల్ని ఎందుకు చంపుతారు అని వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో వారు చూసారు. కానీ చరణ్ ఇచ్చిన క్లారిటీ మాత్రం అందరికీ బాగా నచ్చింది.