Chiranjeevi: చిరు ‘ఓకే’ అంటే ప్రాజెక్ట్‌ సెట్‌ అయిపోయినట్లే…!?

Chiranjeevi: చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ చిత్రీకరణ తుదిదశలో ఉంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ పలు కారణాలతో వెనక్కి వెళ్లింది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి తదుపరి చిత్రం ఏంటనేది ఇప్పుడు చర్చ. ఈ విషయంపై చిరంజీవి కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘విశ్వంభర’ సంక్రాంతి తర్వాత విడుదల కాబట్టి చిరంజీవి కూడా నెక్ట్స్‌ ఏంటి అనే విషయంలో కూల్‌గా ఉన్నారు. అయితే ఆయనతో సినిమా కోసం పలు దర్శకులు, రచయితలు వాళ్ల పనులతో బిజీగా ఉన్నారు.

చిరు సిగ్నల్‌ ఇస్తే సెట్స్‌ మీదకు వెళ్లడానికి కంగారుగా ఉన్నారు. రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి చిరంజీవికి ఓ కథ చెప్పారు. అయితే దర్శకుడు మాత్రం ఆయన కాదు. మోహన్‌ రాజాతో కలిసి ఆయన వర్క్‌ చేస్తున్నారు. కథ దాదాపుగా సిద్ధమైంది. చిరు ‘ఓకే’ అంటే ప్రాజెక్ట్‌ సెట్‌ అయిపోయినట్లే. చిరంజీవి కోసం బీవీఎస్‌ రవి ఓ సామాజిక సందేశం నిండిన కథ రాశారట.’ఠాగూర్‌’ తరహా సినిమా అని, బలమైన సందేశంతో పాటు, కమర్షియల్‌ హంగులన్నీ ఉంటాయని తెలుస్తోంది.

ఇదే విషయంపై బీవీఎస్‌ రవి కూడా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘‘చిరంజీవి అంటే, పాటలు డాన్సులు గుర్తొస్తాయి. ఆ తరహా చిత్రాలు ఆయనే ఎన్నో చేశారు. అలాగే సందేశాత్మక చిత్రాలు చేశారు. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఓ పెద్ద స్టార్‌ బలమైన సందేశాన్ని ఇస్తే , చాలామందికి చేరువ అవుతుందని, తాను అలాంటి కథే సిద్థం చేశానని చెప్పుకొచ్చారు బీవీఎస్‌ రవి. ‘విశ్వంభర’ తమ సినిమానే మొదలవుతుందని కూడా చెప్పారు.

గతంలో కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు. అది పట్టాలెక్కలేదు. అది కూడా క్యూలో ఉందా లేదా అనేది చూడాలి. హరీష్‌ శంకర్‌ కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘విశ్వంభర’ తరవాత ఏ సినిమా చేయాలన్న విషయంలో చిరంజీవి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీవీఎస్‌ రవి కథ కూడా లైన్‌ లో ఉందని, అయితే చిరు అంగీకారం తెలపాలని అంటున్నారు.

Cine Critic Dasari Vignan About Thalapathy Vijay Political Entry || Pawan Kalyan || Telugu Rajyam