Chiranjeevi: రెమ్యూనరేషన్ భారీగా పెంచిన చిరు… శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఎంతనో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన త్వరలోనే విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అదే రోజు తన కొడుకు రామ్ చరణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ కోసం చిరు తప్పుకున్నారు.

ఈ క్రమంలోనే చిరు వేసవి సెలవులను పురస్కరించుకొని మే నెలలో విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత నాని సమర్పణలో ఈయన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ఇటీవల అధికారకంగా కూడా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమా కోసం చిరంజీవి తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్క సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఇక ఈయన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నిర్మాతలు ఆయన అడిగినది మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా శ్రీకాంత్ సినిమా కోసం చిరు భారీగానే అందుకోబోతున్నారు.

ఇక ఈ సినిమా గురించి కూడా శ్రీకాంత్ ఇటీవల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో సరికొత్త చిరంజీవి గారిని చూస్తారని ఆయన వయసుకు అనుగుణంగా ఈ సినిమా ఉండబోతోంది అంటూ ఈ సినిమాపై శ్రీకాంత్ ఓదెలా కాస్త ఆసక్తిని పెంచేశారు. విశ్వంభర విడుదల అయిన వెంటనే చిరు ఈ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.