షాకింగ్ ఫ్యాక్ట్ : నాన్న సినిమాలకి చోటివ్వని రామ్ చరణ్.!

Acharya Buyers

తెలుగు ఇండస్ట్రీ దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఇవ్వని హిట్ లేదు అలాగే ఘోరమైన ప్లాప్ కూడా లేదు. అయితే ఇప్పుడు అంటే కేవలం కంటెంట్ ఎలా ఉన్నా ఎంటర్టైనింగ్ గా ఉంటే చాలు హిట్ అవుతున్నాయి. కానీ కంటెంట్ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నాయి.

అలాగే మాస్ కన్నా క్లాస్ వేరియంట్ లో అయితే చిరు నుంచి అవార్డు విన్నింగ్ సినిమాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఎన్నో సినిమాలు ఇచ్చిన చిరు తన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రం నచ్చే ఒక్క సినిమా కూడా ఇవ్వలేకపోయారని ఇప్పుడు అనుకోవాలి.

ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా తన ఖ్యాతిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తో యూఎస్ లో తాను పలు సంస్థలకి ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు కాగా ఈ ఇంటర్వ్యూ లో మన దేశం నుంచి అయితే తనకి ఆల్ టైం నచ్చిన సినిమాల లిస్ట్ చెప్పమంటే..

వాటిలో సీనియర్ ఎన్టీఆర్ అద్భుతం దాన వీర శూర కర్ణ, అలాగే రాజమోళి ఎపిక్ చిత్రం బాహుబలి, అలాగే మిస్టర్ ఇండియా అనే ఓ సినిమా ఆఖరికి తన హిట్ సినిమా రంగస్థలం పేరు కూడా చెప్పాడు కానీ తన తండ్రి మెగాస్టార్ నుంచి ఒక్క సినిమా కూడా చెప్పకపోవడం షాకింగ్ అంశం. చిరు చేసిన ఎన్నో సినిమాల్లో చరణ్ ఏ ఒక్క సినిమా కూడా తన ఫెవరెట్ లిస్ట్ లో లేదా? అని అనుకోవాలి. దీనితో ఈ షాకింగ్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.