మెగాస్టార్ చిరంజీవి .. ఎంతో మందికి ఆదర్శం. సినీ ప్రియులే కాక సెలబ్రిటీలు చాలా మందికి కూడా ఆయన ఆరాధ్య దైవం. ఆయనని ఆదర్శంగా తీసుకొనే చాలా మంది తారలు ఇండస్ట్రీలోకి వచ్చారు. మెగాస్టార్ వేసిన బాటలో పయనించిన పవన్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ ఇలా పలువురు మెగా హీరోలు సత్తా చాటుతూ ఎంతో మంది అభిమానాన్ని పొందారు.
టాలీవుడ్ స్టార్స్ లో చిరంజీవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకు అబిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. సినిమాని భారీ హిట్ చేసి మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ అని నిరూపించారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు పలు రీమేక్ చిత్రాలు కూడా చేస్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టీంతో మరి కొద్ది రోజులలో కలవనున్నారు చిరు.
నిరంజన్ రెడ్డి , కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య చిత్రానికి చిరంజీవి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుండగా, అనిల్ సుంకర నిర్మించనున్న వేదాళం రీమేక్ కు చిరంజీవి రూ.60 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి సినిమా అంటే భారీ లాభాలు రావడం పక్కా కాబట్టి మెగాస్టార్‌కు అడిగినంత మొత్తం ఇచ్చేందుకు అనీల్ సుంకర సిద్దమైనట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వేదాళం రీమేక్ కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, లూసీఫర్ రీమేక్ కూడా చిరు చేయనుండగా,ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు అని అనుకుంటున్నారు.