రాం చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో కొడుకు చరణ్ తో మెగాస్టార్ చిరంజీవి కలిసి స్క్రీన్ మీద కనిపించి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిరు సాంగ్ నే చరణ్ రీమేక్ చేయగా ఆ సాంగ్ లో తండ్రీ కొడులు డాన్స్ చేయడం అందరికీ విపరీతమైన సంతోషాన్ని కలిగించింది.
రాం చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో కొడుకు చరణ్ తో మెగాస్టార్ చిరంజీవి కలిసి స్క్రీన్ మీద కనిపించి ఫ్యాన్స్ కి మాత్రమే
ఆ తర్వాత చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో మరోసారి చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు మెగాస్టార్. మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అలానే అదిరిపోయో యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ కనిపించి ‘ జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదు ‘.. అన్నారు.
ఇలా తండ్రీ కొడులుకు మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేం లో కలిసి కనిపించిన కాసేపటికే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కాబట్టే ఇద్దరు మరోసారి ఖైదీ నంబర్ 150 లో సాంగ్ లో కలిసి స్టెప్పులేశారు. కాని ఫ్యాన్స్ కి ఇది సరిపోవడం లేదు. అందుకే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి ఆచార్య లో నటించబోతున్నారు. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేం లో కనిపించబోతున్నారు.
అయితే ఈసారి చరణ్ ఈ సినిమాలో 35 నిముషాలు కనిపిస్తాడని చిరు చరణ్ కలిసి కొన్ని సీన్స్ లో కనిపించి మెగా ఫ్యాన్స్ అదిరిపోయో ట్రీట్ ఇస్తారని చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. కొరటాల చరణ్ కోసం ప్రత్యేకమైన పాత్రని తీర్చి దిద్దారట. రేపు సినిమా రిలీజయ్యాక బాక్సులు బద్దలే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక మెగాస్టార్ ఆచార్య తర్వాత రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ రీమేక్ లూసిఫర్ ఒకటి కాగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ లో నటించబోతున్నారు.