Home News చిరు బ్ల‌డ్ బ్యాంక్‌లో నాగబాబు బ‌ర్త్‌డే వేడుక‌.. ముఖ్య అతిధిగా మెగాస్టార్

చిరు బ్ల‌డ్ బ్యాంక్‌లో నాగబాబు బ‌ర్త్‌డే వేడుక‌.. ముఖ్య అతిధిగా మెగాస్టార్

మెగాబ్ర‌దర్ నాగాబుబు ఈ రోజు 59వ వసంతంలోకి అడ‌గు పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న తమ్ముళ్ళు ప‌వ‌న్‌, నాగబాబుల‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, ద‌యా హృద‌యుడు, స‌ర‌దా వ్యక్తిత్వం ఉన్న‌ ‌నా సోద‌రుడు నాగ‌బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాల‌ని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

E96F81Be 1F3E 4163 Bd9D 3508Ad8B8Bd1 | Telugu Rajyam

చిరు ట్వీట్‌కు స్పందించిన నాగ‌బాబు.. థ్యాంక్స్‌ అన్నయ్య.. నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.క‌ట్ చేస్తే నాగ‌బాబు 59వ బ‌ర్త్‌డే వేడుక‌ని చిరంజీవి స‌మ‌క్షంలో మెగా అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హించారు. చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో ఈ వేడుక జ‌ర‌గ‌గా, చిరంజీవి త‌న త‌మ్ముడి చేత కేక్ క‌ట్ చేయించారు. ప్ర‌స్తుతం నాగ‌బాబు కేక్ క‌ట్ చేసిన ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

నాగబాబుకి మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. చిన్న‌ప్పుడు మావ‌య్య‌తో దిగిన ఫోటోని షేర్ చేసిన తేజ్‌.. క్రీడలు, కళలలోకి రావడంలో న‌న్నుప్రోత్స‌హించిన వారిలో నాగ‌బాబు ఒక‌రు. ఆయ‌న‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అని పేర్కొన్నారు. నాగబాబు కుమారుడు, హీరో వరుణ్‌ తేజ్‌, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు కూడా మెగా బ్ర‌ద‌ర్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాగా, నాగ‌బాబు కొద్ది రోజుల క్రితం కరోనా జ‌యించాడు. ఆస్త‌మా ఉన్న నేప‌థ్యంలో చాలా భ‌య‌ప‌డ్డ నాగ‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త్వ‌ర‌గా కోలుకున్నారు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News