సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి స్టార్‌డమ్ కొనసాగుతోంది ఏళ్ల తరబడి. దాదిపు తొమ్మిదేళ్ల పాటు, రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా వున్నారాయన. అయినా కానీ, ఆయన స్టార్‌డమ్‌లో ఎలాంటి మార్పూ లేదు.
‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి పనైపోయిందనుకున్నారు కొంతమంది యాంటీ మెగా అభిమానులు. ఈ స్థాయిలోనూ కూడా ఆయన్ని తొక్కేసే ప్రయత్నాలు జరిగాయ్. అయినా కానీ, ఆయన ఇమేజ్‌కి వచ్చిన నష్టమేమీ లేదు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే. మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఈ సినిమా లేటెస్ట్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకిగాను చిరంజీవి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.
అది ఎంత.? అంటే ఎవరి ఊహలకీ అందనంత.? అని ప్రచారం జరుగుతోంది. అయితే, రెమ్యునరేషన్ తీసుకునే విషయంలో చిరంజీవి ఎప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి.
ఈ సినిమా విషయంలోనూ చిరంజీవి అదే చేస్తున్నారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ చిరంజీవికి అత్యంత ప్రతిష్థాత్మకంగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట ఈ నిర్మాణ సంస్థ.
ఇక ట్రోలింగ్ అంటారా.? అది చిరంజీవి కాలి చిటికెన వేలిమీద మొలిచిన వెంట్రుక కూడా తాకలేవంటూ కుండ బద్దలు కొట్టేస్తున్నారు మెగా అభిమానులు. దటీజ్ చిరంజీవి.! ఇదీ.. ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ విషయమై జరుగుతున్న వాడీ వేడీ చర్చ.