‘విశ్వంభర’.! మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.?

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.! ఎందుకంటే, ఆయన కెరీర్‌లో చాలా సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి.

మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సినిమాకి పరిచయం చేయడంలో చిరంజీవి తనదైన ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అలా, గ్రాఫిక్స్‌ని వేరే లెవల్‌లో తెరపై ఆవిష్కరించిన చిరంజీవి సినిమా ‘అంజి’.!

అయితే, సినిమా నిర్మాణానికి చాలా సమయం పట్టడంతో, ‘అంజి’ సినిమా, అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినాగానీ, గ్రాఫిక్స్ పరంగా అదో అద్భుతం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

అప్పట్లోనే ఆయన, ఇలాంటి సినిమా ఇంకోటి చేయాలని అనుకున్నారు. ఆ కోరిక, ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాతో తీరబోతోందిట. ‘విశ్వంబర’ సినిమా వీఎఫ్ఎక్స్ విషయమై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అంటున్నారు.

హాలీవుడ్ నిపుణుల్ని ఈ సినిమా కోసం వాడుతున్నారట. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే, ఇది కూడా ‘అంజి’ తరహాలోనే వుండబోతోందని. చిరంజీవి కళ్ళు మీదనే ఎక్కువ ఫోకస్ ఈ సినిమాలో వుండబోతోందని సమాచారం.!