Chiranjeevi : రాజమౌళి సెంటిమెంట్ పై చిరు కామెంట్స్…!

Chiranjeevi : మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో ప్రస్తుతం కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైనది. ఈ సినిమా లో తొలిసారి చిరు, చెర్రీ కలిసి నటించారు. ఈ సినిమా చిరంజీవి భార్య సురేఖగారి కల. సినిమా చూసి ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సినిమాలో చిరంజీవి ఆచార్య అనే నక్సలైట్ పాత్రలో నటించారు.సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఇక మెగాస్టార్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ వేడుకకు వచ్చిన రాజమౌళికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రాజమౌళిని ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లు దోహదపడ్డాయన్నారు మెగాస్టార్. అలాంటి సినిమాల నిర్మాణ కర్త రాజమౌళి ఇక్కడ ఉండటం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఇక రాజమౌళిని పీఠాధిపతితో పోల్చారు.

ఇక చిరంజీవి రాజమౌళి సినిమాలో నటించిన హీరో నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను కూడా ప్రస్తావించారు.సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోల నెక్స్ట్ మూవీస్ పరాజయం పాలవుతాయని ఓ టాక్ ఉంది. అయితే అది నిజం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని కాన్పిడెంట్‌గా చెప్పగలను. రేపొద్దున్న సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. అలాంటి అనుమానాలేవీ పెట్టుకోకుండా ‘ఆచార్య’ చిత్రాన్ని ఆస్వాదించండి.. నిజంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’.. అంటూ చిరంజీవి చెప్పారు. ఇక ఆచార్య ఏప్రిల్ 28న ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది.