‘హనుమాన్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన విషయం విదితమే. వాస్తవానికి, చిరంజీవి అండదండలు లేకుంటే, ‘హనుమాన్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేదే కాదు. ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ అంత బలంగా నిలబడిందంటే, తెరవెనుకాల చిరంజీవి అనే ‘పిల్లర్’ వుండబట్టే.!
‘గుంటూరు కారం’ హీరో మహేష్ అంటే, చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం. ‘హనుమాన్’ వల్ల ‘గుంటూరు కారం’ సినిమాకి ఇబ్బంది వస్తుందని చిరంజీవి అనుకోరు. అసలు ఎవరూ అలా అనుకోలేరు కూడా.
అయితే, ‘గుంటూరు కారం’ పంపిణీదారు దిల్ రాజు ఆడిన హైడ్రామా దెబ్బకి, ‘హనుమాన్’ విలవిల్లాడింది. ఓ దశలో, వెనక్కి తగ్గుదామా.? అనుకుందట ప్రశాంత్ వర్మ అండ్ టీమ్. కానీ, చిరంజీవి ‘గో ఎహోడ్’ అని భరోసా ఇచ్చారట. సినిమా విడుదల రోజున, చిరంజీవితో టీమ్ అంతా టచ్‌లో వుందట.
ఎక్కడ ఏ సమస్య వచ్చినా, తాను పరిష్కరించేందుకు అందుబాటులో వుంటానని చిరంజీవి భరోసా ఇచ్చారట కూడా. ఈ నేపథ్యంలోనే సినిమా సక్సెస్ మీట్ కూడా చిరంజీవితోనే నిర్వహించాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త టైమ్ తీసుకుని, భారీ స్కేల్‌లో ‘హనుమాన్’ సక్సెస్ ఫంక్షన్ నిర్వహిస్తారని సమాచారం.
ఏ కారణం చేతనో, సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాల్సిన మెగాస్టార్ చిరంజీవి, ఆ రిస్క్ తీసుకోలేకపోయారనీ, ‘జై హనుమాన్’ (హనుమాన్ సీక్వెల్)లో మాత్రం కనిపిస్తారనీ అంటున్నారు.