చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.ఒకప్పుడు స్టార్ హీరోల పుట్టినరోజులు కనుక వస్తే అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ పుట్టినరోజు వేడుకలను జరిపేవారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ అమలులోకి వచ్చింది. ఏ హీరో పుట్టినరోజు అయితే ఆ రోజున ఆ హీరో నటించిన బ్లాక్ బస్టర్ సినిమా తిరిగి విడుదల చేయడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను విడుదల చేయడంతో ఈ సినిమాకి అనూహ్యమైన ఆదరణ వచ్చింది.

ఈ విధంగా పోకిరి సినిమా తర్వాత కూడా మంచి కలెక్షన్లను రాబట్టడంతో మిగతా హీరోల అభిమానులు కూడా తమ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఇలా సినిమాలను తిరిగి విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన కెరియర్ లో బ్లాక్ పాస్టర్ గా నిలిచిన సినిమాలలో ఒక సినిమాని తిరిగి విడుదల చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సూపర్ హిట్ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షో ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలా చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలో ఘరానా మొగుడు ఒకటి ఈ సినిమాను తిరిగి థియేటర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.మరి చిరంజీవి సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే వచ్చే నెల రెండవ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు కూడా జల్సా సినిమాను తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమాలు ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటాయో తెలియాల్సి ఉంది.