మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాను ఎలా రఫ్ఫాడిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ట్విట్టర్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి దుమ్ములేపుతున్నాడు. ఒక్కొక్కరిపై వేసే సెటైరికల్ ట్వీట్లు, పెట్టే జిఫ్ ఫైల్‌లు చూస్తుంటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. యంగ్ హీరోల కంటే స్పీడుగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్రెండీగా అవుతూనే ఉన్నాడు. చిరంజీవి సమయానుగుణంగా తన ప్రొఫైల్ పిక్‌ను చేంజ్ చేశాడు. తాజాగా చిరు ప్రొఫైల్ పిక్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఉగాది రోజున ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. పాత ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఉగాది కాబట్టి సంప్రదాయ బద్దంగా ఉండేలా ఓ ఫోటోను పెట్టాడు. ఆ తరువాత వెంటనే మార్చేశాడు. మళ్లీ ఆ మధ్య అర్బన్ మాంక్ అంటూ గుండు ఫోటోను పెట్టాడు. వేదాళం సినిమా రీమేక్ కోసం ఫోటో షూట్ ట్రై చేశాడు. అలా కొన్ని రోజులు గుండు ఫోటోను పెట్టేశాడు. ఆ తరువాత మళ్లీ క్లీన్ షేవ్‌తో ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. మొత్తానికి చిరు తన ప్రొఫైల్ పిక్‌లతోనే రచ్చ చేస్తున్నాడు.
తాజాగా మరోసారి చిరంజీవి తన స్టైల్, మ్యానరిజం కనపడేలా అదిరిపోయే పిక్‌ను పెట్టాడు. ఇందులో చిరు గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. అలా ఓ లుక్కిస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇది ఆచార్య సినిమాకు సంబంధించిన ఫోటో షూట్, లేదా అక్కడి సెట్‌లో దిగిన పిక్ అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప్రొఫైల్ పిక్‌లు చేంజ్ చేస్తూనే చిరంజీవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు.