బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి.?

చిరంజీవితో సినిమాలు తీయాలని క్యూ కడుతున్న డైరెక్టర్ల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటికే డజనుకు పైగా డైరెక్టర్లు రెడీగా వున్నారు. ఇది అనూహ్యమైన పరిణామమే.

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ, చిరంజీవి కోసం మరో సబ్జెక్ట్ రెడీ చేసేశాడట. చిరంజీవి కూడా బాబీ వర్క్ మీద కాన్ఫిడెంట్‌గానే వున్నాడట.

అయితే, చిన్న కన్‌ఫ్యూజన్. ఏ సినిమా ముందు చేయాలి.? ఏ సినిమా తర్వాత చెయ్యాలి.? అనే కన్‌ఫ్యూజన్‌లో చిరంజీవి వున్నాడట.

ఇప్పటికయితే, చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాపై మాత్రమే ఫోకస్ పెట్టాడు. సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చిరంజీవి వెకేషన్ కారణంగా చిన్న బ్రేక్ తీసుకుంది.

ఈ సినిమా అయిపోయాకా, వెంటనే ఏ సినిమాని పట్టాలెక్కించాలన్న కన్‌ఫ్యూజన్‌లోనే చిరంజీవి వున్నారట. చూడాలి మరి, ఆ కన్‌ఫ్యూజన్ వీడి ఏ సినిమాకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో.!