చిరంజీవి కొత్త సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ వుండదా.?

చిరంజీవి చేయబోయే కొత్త సినిమాని డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘భోళా శంకర్’ డిజాస్టర్ అయినప్పటికీ, తన తదుపరి సినిమాల్ని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి చిరంజీవి రెడీగా వున్నారట.

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇదో డిఫరెంట్ మూవీ అని అర్ధమవుతోంది. అవును నిజమే, థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా వుండబోతోందట. అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి అస్సలు చోటుండదనీ తెలుస్తోంది.

అయితే, చిరంజీవి సినిమాలకి ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే ఎలా.? అందుకే డిఫరెంట్ పంథాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికైతే సీరియస్ మోడ్‌లోన కథ సిద్ధమైందనీ తెలుస్తోంది.

ఒకవేళ పెట్టాల్సి వస్తే, ప్రత్యేకంగా కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లు మాత్రమే యాడ్ చేయనున్నారట. కానీ, చాలా తక్కువ పార్ట్‌లో మాత్రమే ఫన్ ఎపిసోడ్స్ వుండబోతున్నాయనీ అంటున్నారు.

సినిమా కథ విషయానికి వస్తే, ‘అంజి’ తరహాలో వుండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఇక, పాటలు కూడా సిట్యువేషనల్‌గా వుండబోతున్నాయట. దాదాపు 6 పాటల వరకూ వుండొచ్చని అంచనా. వీటిలో కొన్ని బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ అనీ తెలుస్తోంది.