ఇండస్ట్రీ టాక్ : ఈ డైరెక్టర్ తో సినిమా ఆపేసిన చిరు?

ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కి “వాల్తేరు వీరయ్య” తో సూపర్ స్టార్ట్ వచ్చింది అనుకుంటే ఈ మధ్యలోనే మళ్ళీ “భోళా శంకర్” భారీ డిజాస్టర్ కూడా దక్కింది. దీనితో మెగాస్టార్ చేస్తున్న రీమేక్ చిత్రాలు విషయంలో చాలా అసహనంగా ఉన్న అభిమానులు మళ్ళీ నెక్స్ట్ చిత్రాలతో చూసుకుందాం అని అనుకుంటున్నారు.

అయితే ఈ చిత్రాల్లో యంగ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ(బంగార్రాజు) దర్శకునితో కూడా ఓ సినిమా కమిట్మెంట్ ఉంది. అలాగే మరో యువ దర్శకుడు బింబిసార ఫేమ్ వసిష్ఠతో కూడా సినిమా ఉండగా ఈ ఇద్దరిలో అయితే అయితే కళ్యాణ్ కృష్ణతో సినిమా ఉండకపోవచ్చు అనే రూమర్స్ ఇపుడు సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

అయితే ఇది స్ట్రైట్ సినిమానా లేక రీమేక్ చిత్రమా అనేది పక్కన పెడితే కళ్యాణ్ కృష్ణ ప్లేస్ లో మరో దర్శకుడు ఆ చిత్రాన్ని చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు వినికిడి. మరి మెగాస్టార్ అయితే ఏ దర్శకునితో చేస్తున్నారో చూడాలి. కాగా మెగాస్టార్ తాజాగా తన మోకాలి సర్జరీ చేయించుకొని రెస్ట్ లో ఉన్నారు.

ఈ ఆపరేషన్ ఢిల్లీలో జరిగినట్టుగా తెలుస్తుంది. దీనితో కొన్ని వారాల పాటు రెస్ట్ లో ఉంది నెక్స్ట్ మెగాస్టార్ తన తదుపరి చిత్రాలు అయితే చేయనున్నారు. ఈ ఆగస్ట్ 22న చిరు బర్త్ డే ఉంది కాబట్టి ఆరోజున అయితే చిరు చేయబోయే నెక్స్ట్ సినిమాల విషయంలో ఏదొక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.