Chiranjeevi : అబ్బాయ్ కోసం కమర్షియల్ కథ వేటలో పెదనాన్న…!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మహా వృక్షంగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తి గా నిలిచారు. ఇక ఆయన ఇంటినుండే చాలా మంది వారసులు హీరోలుగా ఒక్కొక్కరు వస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్, అల్లుడు అల్లు అర్జున్ వారి సొంత స్టార్ డమ్ తో టాప్ హీరోలుగా ఎదిగారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఇంకా అంతగా నిలదొక్కుకోలేదు. వీరిలో వరుణ్ తేజ్ చాలా విభిన్నంగా తన కెరీర్ ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి సినిమాతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కమర్షియల్ హీరోగా మాత్రం విజయవంతం కాలేదు.

ఇక ఇటీవల విడుదలైన గని సినిమా ఘోరంగా విఫలం అవ్వడంతో వరుణ్ కెరీర్ గాడి తప్పిందనిపిస్తోంది.గని సినిమా పూర్తి బాధ్యతను అల్లు కుటుంబం తీసుకుంది.అల్లు అరవింద్ కొడుకు అల్లు బాబీ ఈ సినిమా కు నిర్మాత. వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక వరుణ్ కి ఉన్న మార్కెట్ పై సందేహాలు మొదలయ్యాయి.

తన నెక్స్ట్ సినిమా పవన్ సత్తార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక పవన్ సత్తార్ సినిమాలు కథ పరంగా బాగుంటాయి కానీ కమర్షియల్ హిట్ గా నిలబడవు. అందుకే ఇపుడు వరుణ్ భాద్యతను పెదనాన్న చిరంజీవి తీసుకున్నారట. ఒక మంచి కమర్షియల్ కథ కోసం ఆయన వెతుకుతున్నారట. ఎలా అయిన వరుణ్ ను కమర్షియల్ హీరో గా నిలబెట్టాడని చిరు భావిస్తున్నారట.ప్ర‌వీణ్ స‌త్తారు సినిమా కంటే ముందు ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ని ఓకే చేసి, ప‌ట్టాలెక్కించి, రెండింటినీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌న్న‌ది చిరు ప్లాన్ గా కనిపిస్తోంది .